కుంభరాశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంభ రాశి
Zodiac Symbolవాటర్-బేరర్
Duration (Tropical, Western)19 – 18 (2024, UTC)
Constellationకుంభం
Zodiac Elementఎయిర్
Zodiac Qualityస్థిరమైన
Sign rulerశని (సాంప్రదాయ), యురేనస్ (ఆధునిక)
Detrimentసూర్యుడు (జ్యోతిష్యం)
Exaltationఏదీ లేదు
Fallనెప్ట్యూన్
AriesTaurusGeminiCancerLeoVirgoLibraScorpioSagittariusCapricornAquariusPisces
  • కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎందరో పరిచయం అయినా పాత స్నేహాలను, బంధుత్వాలను మరువరు.
  • ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు.
  • అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురౌతాయి.
  • అవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చి పోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. భాధను అధికముగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాటగా చెప్పడం వలన విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడనికి ప్రయత్నించి విఫలం ఔతారు. మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు.
  • సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్రవిచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు.

కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాలలో ధనము లభించక పొయినా అవసరము లేనప్పుడు ధనము అధికముగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనము సర్ధుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజములో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాలలో ఉన్న వారి వలన అన్యాయానికి గురి ఔతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపొతారు. అకస్మాత్తుగా రాజకీయాధికారము చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. ఏకపక్షముగా పొరబాటుగా తిసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చెస్తాయి. సమాజములో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి ఔతారు. తన సంతానము, ఆత్మీయులు, స్వంత వారు చెసే తప్పులు తప్పులుగా కనిపించవు. వారిని సమర్ధించడానికి రక్షించడానికి అధికముగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారములో అంచనాలు నిజమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి ఔతారు. భుములు విలువ పెరగడము వలన ధనవంతులు ఔతారు.వ్యాపారకూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానము అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికము. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చెసిన నిర్ణయాలు మంచికి దారి తిస్తాయి. వీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్ధులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు ఔతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృతాపరాధాన్ని సరి దిద్దుకోలేరు. మీరు కొల్పోయిన ధనము, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని పేరు వస్తుంది. భాగస్వామ్యము కొంత కాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది.సొదర సోదరీ వర్గానికి సహాయము చేయడము వలన మరో వర్గము దూరము ఔతారు. పైస్థాయి, కిందస్థాయి వారి వలన ఏకకాలములో ఇబ్బందులు ఎదురౌతాయి. ఋణల విషయములో అసత్య ప్రచారాలు ఎదురౌతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురౌతుంది. ఆత్మీయ వర్గము ద్రోహము చెస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు.ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు. ఎదుటి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. వీరి కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలములో వారిని వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్థులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రు వర్గము మీద విజయము సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులురాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏదిక్కూ దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్త్రోత్ర పారాయణము మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది.

కుంభరాశి కొన్నిజ్యోతిష విషయాలు

[మార్చు]

కుంభ రాశి జాతకచక్రంలో పదకొడవ స్థానంలో ఉంది. ఈ రాశ్యధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేసి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్దం అర్ధ శబ్దం, అర్ధ జల రాశి, జీవులు మానవులు, జాతి వైశ్య జాతి, సంతానం సమ సంతానం, సమయం పగటి సమయం, పరిమాణం హస్వం, ఉదయం శీర్షోదయం, దిక్కు పడమర దిక్కు, ప్రకృతి వాత, కఫ, పిత్త ప్రకృతి, కాలపురుషుని శరీరావయవం పిక్కలు. ఇది విషమ రాశి.

  • నిరయన రవి ఈరాశిలో ఫిబ్రవరి పదిహేన తేదీలో ప్రవేశిస్థాడు.
  • ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు. సహజంగా ఛాయా గ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు.
  • ఈ రాశి గూఢాచారులను, వ్యాపారులను సూచిస్తుంది,
  • గృహంలో నీటి పారలు, నీరు ఉండే ప్రదేశాలు ఈ రాశికి స్థానాలు.
  • ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారు, అల్పసంతోషులు, దానధర్మములు చేయు వారు, ఎవరిని నొప్పించ మాటాడని వారు, సామాన్యులుగా ఉంటారు. సన్నని వారై ఉంటారు.
  • ఈ రాశి వారికి అయిదు, పన్నెండు, ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
  • ఈ రాశికి అంటు వ్యాధులు, నేత్ర వ్యాధులు, చర్మరోగములకు కారకత్వం వహిస్తాడు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]