ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా

women

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, కొటేరు శ్రావణి
  • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలకు తుది గడువు దగ్గరపడుతుంది. మరో నాలుగు రోజుల్లో ఇది ముగుస్తుంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారులు వాటిని ఈవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేసుకోకపోతే రిటర్నులు దాఖలు చేసి ఫలితం ఉండదు.

కట్టాల్సిన మొత్తం కంటే ఎక్కువగా ఏమైనా పన్నులను కడితే రిటర్నులను ఈవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత రిఫండ్ రూపంలో వెనక్కి వస్తుంది.

టీడీఎస్ లేదా టీసీఎస్ లేదా అడ్వాన్స్ ట్యాక్స్ లేదా సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూపంలో మనం కట్టిన అదనపు మొత్తాన్ని లెక్కించి, ఆదాయపు పన్ను విభాగం వాటిని ప్రాసెస్ చేస్తుంది.

అసెస్‌మెంట్ సమయంలో సమర్పించే డిడక్షన్లు, మినహాయింపులు అన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే పన్నును లెక్కిస్తుంది ఆదాయపు పన్ను విభాగం.

పన్ను చెల్లింపుదారులు రిటర్నులను ఈవెరిఫికేషన్ చేసిన తరువాతే రిఫండ్ ప్రాసెస్‌ కూడా మొదలవుతుంది.

పన్ను చెల్లింపుదారుల అకౌంట్‌లోకి ఈ రిఫండ్ మొత్తం జమ అయ్యేందుకు సాధారణంగా 4 నుంచి 5 వారాల సమయం పడుతుందని ఆదాయపు పన్ను విభాగం తన పోర్టల్‌లో పేర్కొంది.

అయితే, ఈ కాల వ్యవధిలో రిఫండ్ మొత్తం మీ అకౌంట్లోకి జమ కాకపోతే, ఐటీఆర్‌లో ఏమైనా లోపాలున్నాయేమో పన్ను చెల్లింపుదారులు చెక్ చేసుకోవాలి.

రిఫండ్‌కు సంబంధించి ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందేమోనని మెయిల్‌ చెక్ చేసుకోవాలి.

అలాగే, రిఫండ్ స్టేటస్‌ను పన్ను చెల్లింపుదారులు ఈఫైలింగ్ పోర్టల్‌లో కూడా చూసుకోవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఆదాయ పన్ను రిఫండ్

ఫొటో సోర్స్, Getty Images

ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో రిఫండ్ స్టేటస్‌ చెక్ చేయాలంటే ఇవి తప్పనిసరి

  • వాలిడ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్
  • ఆధార్ నంబర్‌తో అనుసంధానమైన పాన్ నంబర్ (ఆధార్ నంబర్ లేదా పాన్ నంబర్ ఉపయోగించి లాగిన్ కావొచ్చు)
  • రిఫండ్‌ను క్లయిమ్ చేసుకుంటూ దాఖలు చేసిన రిటర్నులు
ఆదాయ పన్ను పోర్టల్

ఫొటో సోర్స్, incometax.gov.in

రిఫండ్ స్టేటస్‌ను చెక్‌ చేసుకునే విధానం..

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి, లాగిన్ అనేది క్లిక్ చేయాలి.

అక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేయాలి.

యూజర్ ఐడీగా పాన్ నంబర్ కానీ ఆధార్ నంబర్ కానీ ఉపయోగించుకోవచ్చు.

ఆదాయ పన్ను వెబ్‌సైట్ లాగిన్ ప్రాసెస్

ఫొటో సోర్స్, www.incometax.gov.in

ఇండివిడ్యువల్ యూజర్లు ఎవరైనా తమ పాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే, ఒక పాప్-అప్ మెసేజ్ వస్తుంది.

ఆధార్‌తో అనుసంధానం లేకపోవడంతో, మీ పాన్ నెంబర్ ఇన్‌ఆపరేటివ్ అని వస్తుంది.

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించుకునేందుకు, ‘లింక్ నౌ’(Link Now) అనే బటన్‌ క్లిక్ చేయాలి.

అప్పటికే అనుసంధానం చేసి ఉంటే మళ్లీ లింక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కంటిన్యూ అనే దానిపై క్లిక్ చేసి తరువాత స్టెప్‌కు వెళ్లొచ్చు.

ఆదాయ పన్ను పోర్టల్

ఫొటో సోర్స్, www.incometax.gov.in

ఆ తర్వాత సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి.. ‘మీ రిఫండ్ స్టేటస్ తెలుసుకోండి’(నో యువర్ రిఫండ్ స్టేటస్) అనే దానిపై క్లిక్ చేయాలి.

ఆదాయపు పన్ను విభాగం

ఫొటో సోర్స్, Income Tax India Youtube

కావాల్సిన అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రిఫండ్ స్టేటస్‌ను మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

మీరు రిఫండ్ స్టేటస్‌ తెలుసుకోవాలనుకుంటున్న అసెస్‌మెంట్‌ ఇయర్‌ను ఎంచుకుని, సబ్‌మిట్ బటన్‌ను నొక్కాలి.

  • నోట్: 2023 మార్చి 31 లేదా అంతకుముందు రిఫండ్‌కు సంబంధించి అయితే, Protean (NSDL) వెబ్‌సైట్‌లో రిఫండ్ స్టేటస్‌‌ను క్లిక్ చేయడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
  • రిఫండ్‌కు సంబంధించిన సందేహాలన్నిటికీ రిఫండ్ బ్యాంకర్(ఎస్‌బీఐ) హెల్ప్‌లైన్ నెంబర్ 18004259760కి కాల్ చేయాలి. మీ నిర్దేశిత బ్యాంకు అకౌంట్‌కు సంబంధించి ఏదైనా సమస్యలుంటే, బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించండి.
  • రిఫండ్ కోసం ఈఫైలింగ్ పోర్టల్‌లో బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఐఎఫ్‌ఎస్‌సీ, బ్యాంకు అకౌంట్ నెంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలన్నీ అప్‌డేట్‌గా ఉండాలి.
  • మీ వాలిడేటెడ్ బ్యాంకు అకౌంట్ వివరాలను www.incometax.gov.in లో చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఈఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, ప్రొఫైల్‌లోకి వెళ్లి, మై బ్యాంకు అకౌంట్ సెక్షన్‌లో రీవాలిడేట్/యాడ్ బ్యాంకు అకౌంట్ అనే దానిపై క్లిక్ చేయాలి.

రిఫండ్ జారీ అయితే ఇలా చూపిస్తుంది..

ఆదాయపు పన్ను

ఫొటో సోర్స్, www.incometax.gov.in

రిఫండ్ సవరించి పాక్షికంగా జారీ చేస్తే ఇలా కనిపిస్తుంది.

ఆదాయపు పన్ను

ఫొటో సోర్స్, www.incometax.gov.in

పూర్తి రిఫండ్ వస్తే..

ఆదాయపు పన్ను

ఫొటో సోర్స్, www.incometax.gov.in

రిఫండ్ విఫలమైతే ఇలా..

ఆదాయపు పన్ను రిఫండ్

ఫొటో సోర్స్, www.incometax.gov.in

ఒకవేళ మీ పాన్ నెంబర్ ఇన్‌ఆపరేటివ్‌లో ఉంటే రిఫండ్ రాదు.

పాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని హెచ్చరికతో పాప్-అప్ మెసేజ్ వస్తుంది.

ఆదాయపు పన్ను పాప్ అప్ మెసేజ్

ఫొటో సోర్స్, www.incometax.gov.in

రిఫండ్‌ రాకపోవడానికి ఇతర కారణాలు..

  • బ్యాంకు అకౌంట్ ప్రీ-వాలిడేట్‌గా లేనప్పుడు రిఫండ్ ఫెయిల్ అవుతుంది.
  • కచ్చితంగా మీ బ్యాంకు అకౌంట్ ప్రీ-వాలిడేట్‌లో ఉండాలి.
  • పాన్ కార్డు వివరాల్లో, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న మీ పేరు సరిపోనప్పుడు రిఫండ్ విఫలమవుతుంది.
  • ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఇన్‌వాలిడ్ అయినప్పుడు ఇలా జరుగుతుంది.
  • ఐటీఆర్‌లో పేర్కొన్న అకౌంట్ క్లోజ్ అయినప్పుడు కూడా రిఫండ్ ఫెయిల్ అవుతుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్

ఫొటో సోర్స్, Income Tax India Youtube

రిఫండ్ ఫెయిల్ అయితే, రిఫండ్ రీఇష్యూ రిక్వెస్ పెట్టుకోవచ్చు. దీని కోసం ఇలా చేయాలి.

  • సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి, రిఫండ్ రీఇష్యూను నొక్కాలి.
  • క్రియేట్ రిఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్‌ను క్లిక్ చేయాలి.
  • అక్నాలెడ్జ్‌మెంట్ నంబరు నమోదు చేసి కంటిన్యూను నొక్కాలి.
  • ఆ తర్వాత ఏ బ్యాంకు అకౌంట్‌లోకి రిఫండ్ మొత్తం రావాలనుకుంటున్నారో ఆ వివరాలను ఎంపిక చేసుకుని రీవాలిడేట్ చేయాలి.
  • నోట్: మరేదైనా బ్యాంక్ అకౌంట్‌లోకి రిఫండ్ మొత్తం రావాలనుకుంటే, యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేది క్లిక్ చేసి అక్కడ మీ అకౌంట్ వివరాలు నమోదు చేసి, వాలిడేట్ అని నొక్కాలి. రిఫండ్ కోసం బ్యాంక్ అకౌంట్ వాలిడేట్ అవ్వడం తప్పనిసరి.
  • ఆ తర్వాత యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను ఎంపిక చేసుకుని, వెరిఫికేషన్ కోసం ప్రొసీడ్ అని దానిపై నొక్కాలి.
  • వెరిఫికేషన్ తర్వాత రిఫండ్ రిక్వెస్ట్‌ సబ్‌మిట్ అవుతుంది.

(ఆధారం: ఆదాయ పన్ను శాఖ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)